ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Godfather pre release business details

గాడ్ ఫాదర్ టార్గెట్ రివీల్డ్

Godfather pre release business details

మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన గాడ్ ఫాదర్ రేపు బుధవారం రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 5 దసరా స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న గాడ్ ఫాదర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరు-సల్మాన్-నయన్ కలయిక మూవీ కదా ఆ మాత్రం ఉంటుంది. హిందీలోనూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ ని ఫుల్ కాన్ఫిడెంట్ గా విడుదల చేస్తున్నారు. కారణం సల్మాన్ ఉన్నాడు కాబట్టి. ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండడంతో ప్రేక్షకుల చూపు గాడ్ ఫాదర్ పైనే ఉంది.. భారీ అంచనాలే కాదు భారీ టార్గెట్ నే గాడ్ ఫాదర్ ఫిక్స్ చేసింది.. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా..

ఏరియా          ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం               22 కోట్లు 

సీడెడ్               13.5 కోట్లు 

ఆంధ్ర               35 కోట్లు

ఆంధ్ర- తెలంగాణలో - 70.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.

కర్ణాటక              6.50 కోట్లు 

హిందీ               6.50 కోట్లు 

ఓవర్సీస్            7.5 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అంటే 90 కోట్ల టార్గెట్ తో గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుందన్నమాట.

Godfather pre release business details out

godfather
chiranjeevi
godfather pre release business