Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan sparkles in a regal avatar in historical drama Hari Hara Veera Mallu

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం

Pawan Kalyan sparkles in a regal avatar in historical drama Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెరకెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుండి నేడు పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ పోస్టర్ లో

స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం...

అన్నట్లుగా కనిపిస్తారు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. అంతేకాదు రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటం తో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా ఆ వీడియో ఉండబోతోందన్నది నిజం.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా హరిహర వీరమల్లు చిత్రం రూపు దిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.

Pawan Kalyan sparkles in a regal avatar in historical drama Hari Hara Veera Mallu latest poster

pawan kalyan
hari hara veera mallu movie
pawan birthday special