Advertisement

తాప్సి ఫిలిం ఫేర్ అందాలు

Taapsee Pannu Photoshoot for Filmfare

హీరోయిన్ తాప్సి సౌత్ లో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. సౌత్ లో గ్లామర్ రోల్స్ చేసినా ఆమెకి స్టార్ ఆఫర్స్ రాలేదు.. మెల్లగా అవకాశాలు సన్నగిల్లుతున్న టైం లో తాప్సి కి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. అక్కడ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రాకపోయినా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తో హైలెట్ అయ్యింది. బాలీవుడ్ నీళ్ళు ఒంటబట్టించుకున్న తాప్సి బికినీ షోస్ తో రెచ్చిపోతుంది. అలాగే మరో టాప్ హీరోయిన్ కంగనాతో కయ్యానికి కాలు దువ్వుతుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కిక్ అవ్వగానే సౌత్ ఇండస్ట్రీ, ఇక్కడి డైరెక్టర్స్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఇక్కడి డైరెక్టర్స్ కి గ్లామర్ తప్ప ఇంకేం అక్కర్లేదు కాబట్టే హీరోయిన్స్ సక్సెస్ అవడం లేదు అనేసింది.

అయితే తాజాగా మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మిథు తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తాప్సి.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ గ్లామర్ గా ప్రెస్ మీట్ కి హాజరైన తాప్సి.. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. విపరీతంగా ఎక్సపోజ్ చేస్తూ తాప్సి అందాలు ఆరబోసిన విధానం చూస్తే అమ్మ తాప్సి ఇన్ని అందాలను ఇన్నాళ్ళుగా ఎక్కడ దాచేసావ్ అనేస్తారు. అంతగా తాప్సి అందాలు ఫిలిం ఫేర్ ఫోటో షూట్ లో రివీల్ అయ్యాయి. కర్లీ హెయిర్ తో క్రీం కలర్ బ్రాతో, దానిపై ఓ కోట్ తో బికినీ వేసిన తాప్సి హాట్ లుక్స్ యూత్ గుండెలని పిండేసేలా ఉన్నాయి. మరి తాప్సి ఫిలిం ఫేర్ అందాలపై మీరు ఓ లుక్కెయ్యండి.

Taapsee Pannu Glamour Photoshoot for Filmfare

taapsee pannu
tapsee photoshoot
filmfare
tapsee photos