ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja Ramarao On Duty Releasing On July 29th

ఫైనల్లీ రామారావు కి డేట్ ఫిక్స్ అయ్యింది

Ravi Teja Ramarao On Duty Releasing On July 29th

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని జూన్ నెలలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నామంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మధ్యలో ఏమైందో ఏమో.. రామ రావు ఆన్ డ్యూటీ అనుకున్న టైం కి రావడం లేదు అన్నారు. అలాగే రవితేజకి - ఈ సినిమా నిర్మాతలకు మధ్యలో ఏవో విభేదాలు.. అందుకే సినిమా రిలీజ్ లేట్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతుంది. 

తాజాగా రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సినిమా థియేట్రికల్ విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉంది. రానున్న రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ కు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్ గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty Releasing On July 29th

mass maharaja ravi teja
sarath mandava
sudhakar cherukuri
ramarao on duty
ramarao on duty releasing on july 29th