బిగ్ బాస్: ఫైనల్లో డ్రామా క్వీన్

Bigg Boss: Drama Queen in the Final

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పటినుండి డ్రామా క్వీన్ గా ప్రాజెక్ట్ అయ్యి, వీక్ కంటెస్టెంట్ గా ఉన్న మిత్ర శర్మ టాప్ 7 కి వెళ్లడమే ఎవరికి అర్ధమే కావడం లేదు. మిత్ర శర్మ ఇంట్లోనే ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలామంది హౌస్ నుండి వెళ్లిపోయారు. స్ట్రాంగ్ అయిన తేజస్వి, ఆర్జే చైతు, అజయ్ లాస్ట్ వీక్ ఆశు రెడ్డి కూడా వెళ్ళిపోయినా మిత్ర శర్మ ఇంకా ఇంకా హౌస్ లోనే ఉండడం పై ప్రతి వారము వచ్చే అనుమానమే అందరిలో ఉంది. మొదటి నుండి నామినేషన్స్ అప్పుడు డ్రామా చేస్తూ ప్రతి ఒక్కరిని అందులో ముఖ్యంగా బిందు మాధవి, యాంకర్ శివ ని ఇమిటేట్ చేస్తూ మిత్ర శర్మ బిగ్ బాస్ హౌస్ లో వరెస్ట్ బిహేవియర్ గా చాలాసార్లు జైలు కి వెళ్ళింది.

ఇక గత వారం యాంకర్ శివ మిత్ర ని టార్గెట్ చెయ్యడంతో.. మిత్ర అవుట్ అఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయి చెయ్యి ని రాడ్ కి వేసి కొట్టుకుని చాలా ఓవర్ చేసింది. దానితో నాగార్జున చాలా తిట్టారు. మిత్ర ఇలాంటివి చేస్తే నువ్వు హౌస్ లో ఉండవని చెప్పాను.. సో నువ్ వెళ్ళిపో గేట్స్ ఓపెన్ చేస్తాను అన్నారు. దానితో మిత్ర వద్దు సర్ ప్లీజ్ అంటూ ఏడుస్తూ మళ్ళీ అతి చేసింది. ఇక టాస్క్ విషయంలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండదు. కానీ ఈసారి కూడా మిత్ర సేఫ్ అయ్యి టాప్ లోకి వెళ్ళిపోయింది. మళ్లీ స్ట్రాంగ్ అనుకున్న నటరాజ్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఎలిమినేట్ అయ్యాడు.

Mitraaw sharma in Bigg boss finale

mitraaw sharma
bigg boss
bigg boss non stop
bigg boss ott