చైతు-సామ్ డివోర్స్ పై నాగ్ సంచలన వ్యాఖ్యలు
Nagarjuna Says Samantha Wanted Divorce from Naga Chaitanyaనాగ చైతన్య - సమంత విడాకులు తీసుకుని వేరవడం అక్కినేని అభిమానులకే కాదు, అక్కినేని ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు. వారి విడాకుల వ్యవహారం తర్వాత నాగార్జున, నాగ చైతన్య - సమంత ఇద్దరూ కావాల్సిన వారే. వారు విడాకులు తీసుకుని విడిపోవడం అనేది కాస్త బాధ పడే విషయమే.. కానీ వారి నిర్ణయాన్ని గౌవరవించక తప్పలేదు అన్నారు. ఆ తర్వాత సమంత - నాగ చైతన్య ఎవరికీ వారే ఈ విడాకుల వ్యవహారాన్ని పక్కనపెట్టి తమ పనుల్లో బిజీ అయ్యారు. సమంత అయినా.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ విడాకుల మేటర్ విషయంలో ఇండైరెక్ట్ గా స్పందించినా నాగ చైతన్య మాత్రం ఈ విడాకులు తీసుకున్న తానూ నేను ఇద్దరం హ్యాపీ గా ఉన్నాం, సమంత డివోర్స్ తీసుకుని హ్యాపీ గా వుంది అంటూ ఓపెన్ అయ్యాడు.
కానీ నాగార్జునని అసలు వాళ్ళు విడిపోవడానికి కారణం చెప్పమని ఎన్నిసార్లు అడిగినా ఆయన స్పందించలేదు. కానీ తాజాగా నాగార్జున సమంత - నాగ చైతన్య విడాకుల మేటర్ పై డిటైల్డ్ గా స్పందించారు. అసలు మొదట విడాకులు కోరుకున్నది సమంత నే అని చెప్పి షాకిచ్చారు. సమంత - చైతన్య పెళ్లి తర్వాత నాలుగేళ్లు చాలా హ్యాపీ గా ఉన్నారు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకలని కూడా కలిసి ఎంజాయ్ చేసారు. ఆ తర్వాతే వారి మధ్యన ఏదో సమస్య వచ్చింది. అప్పుడు సమంత నే డివోర్స్ కావాలని కోరుకుంది. వారి మధ్యన అసలు సమస్య ఏమిటి అనేది నాకు పెద్దగా తెలియదు. సమంత విడాకులు కోసం ముందుగా అప్లై చేసింది.
అలా సమంత విడాకులకు అప్లై చెయ్యడంతో నాగ చైతన్య ఆమె నిర్ణయాన్ని గౌరవించి విడాకులు తీసుకున్నాడు. అయితే విడాకుల విషయం తర్వాత చైతు నా గురించి ఎక్కువగా బాధపడ్డాడు. విడాకుల విషయంలో ఫ్యామిలీ పరువు పోతుందేమో? నేను ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటానో? అంటూ చాలా మధన పడ్డాడు అంటూ నాగార్జున చై - సామ్ విడాకుల మేటర్ పై తొలిసారి స్పందించారు.
Nagarjuna reacts to Samantha and Naga Chaitanya divorce








































