రివ్యూ: గూడుపుఠాణి

Guduputhani Telugu Review

కమెడియన్స్ చాలామంది ఇప్పటివరకు హీరోలుగా నటించారు కానీ సక్సెస్ అందుకుంది కొద్దిమందే. మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన కామెడీ డైలాగులతో మంచి నటనతో మంచి కథలతో ఎంటర్టైన్ చేస్తున్న నటుడు సప్తగిరి. సప్తగిరి ఎల్ ఎల్ బి, సప్తగిరి ఎక్సప్రెస్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు గూడుపుఠాణి అంటూ మరో చిత్రం తో మన ముందుకు వచ్చాడు.

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా రఘు కుంచే ప్రధాన పాత్రలో కె.యమ్. కుమార్ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం గూడుపుఠాణి. ఈ చిత్రం డిసెంబర్ 25 న విడుదల అయింది.

కథ

మన హీరో సప్తగిరి హీరోయిన్ నేహా సోలంకి ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఒక పురాతన అమ్మవారి  దేవాలయంలో పెళ్లి చేసుకుందాం అని సిద్ధం అవుతారు. మరో వైపు దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఆ దొంగలను పటే పనిలో ఉంటారు. అయితే మన హీరో పెళ్లి చేసుకునే గుడిలో కూడా దొంగలు పడతారు. మరి ఆ దొంగలు ఎవరు. సప్తగిరి పెళ్లి జరుగుతుందా. ఆ గుడిలో ఏమి జరుగుతుంది అనేదే కథ.

అద్భుతమైన కథ కధనం తో మంచి ట్విస్ట్ లతో మంచి వినోదభరితమైన చిత్రాన్ని అందించాడు దర్శకుడు కుమార్. సప్తగిరి ని ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలానే చూపించాడు దర్శకుడు. చిత్రంలో కామెడీ తో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్ తో పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు.

సప్తగిరి తన నటన తో అందరిని ఎంటర్టైన్ చేస్తాడు. రఘు కుంచె నటన హై లైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ తన నటనా తో యూత్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

కామెడీ హీరో అల్లరి నరేష్ కి నాంది చిత్రం ఎంతటి పేరు తెచ్చిపెటిందో మన సప్తగిరి కి కూడా ఈ గూడుపుఠాణి అంతటి పేరు తెచ్చిపెడుతుంది. మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో మంచి ఇంటరెస్ట్ కలిగించే చిత్రం. సప్తగిరి తన కామెడీ తో ఎంటర్టైన్ చేస్తూ కొని కీలక సన్నివేశంలో భయపెడతాడు కూడా.

గూడుపుఠాణి మంచి వినోద భరితమైన చిత్రం . మంచి ట్విస్ట్ లతో ప్రేక్షకులని ఆకట్టుకుటుంది. ఫామిలీ తో చూడదగ్గ చిత్రం. తప్పకుండా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Guduputhani Movie Review

guduputhani
saptagiri
guduputhani movie review
guduputhani movie telugu review
guduputhani review