NTR30 పై ఇంట్రెస్టింగ్ న్యూస్

ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ కంప్లీట్ చెయ్యడం మాత్రమే కాదు జెమినీ టివి ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫస్ట్ సీజన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కారణం ఆయన వేలికి ఫ్రాక్చర్ అవడం వలన. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ కొద్ది రోజుల్లో రెడీ కాబోతున్నారట. ఇక కొరటాల తో NTR30 కి ముహూర్తం కూడా పెట్టబోతున్నారట. ఆచార్య మూవీ ఎలాగూ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది.. ఈలోపు NTR30 ని మొదలు పెట్టేసి.. ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసే యోచనలో కొరటాల ఉన్నారట. ఇప్పటికే NTR30 స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందట.

అయితే NTR30 స్క్రిప్ట్ వర్క్ లో ఏకంగా ముగ్గురు పేరున్న రైటర్స్ భాగం అయ్యారట. ఆ టాప్ రైటర్స్ ముగ్గురు కలిసి ఫైనల్ స్క్రిప్టును కొరటాలకు అప్పగించారని, ఆ స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులను కొరటాల సూచించారని తెలుస్తుంది. ఆ స్క్రిప్ట్ పూర్తి కాగానే NTR30 ని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టేస్తారనే న్యూస్ ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవి చంద్రన్ పేరు వినిపిస్తుంటే.. హీరోయిన్స్ గా కియారా అద్వానీ, లేదా అలియా భట్ లు నటించే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. 

NTR30 update

Interesting news on NTR30
ntr30
young tiger ntr
koratala shiva
acharya movie
ntr rrr
evaru meelo kotiswarulu show