పూజ హెగ్డే డ్రెస్ పై చీప్ కామెంట్స్
Cheap comments on Pooja Hegde Dressహీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు టాప్ హీరోయిన్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరోయిన్ కూడా. గ్లామర్ గర్ల్ గా సినిమాల్లో దూసుకుపోతున్న పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ గ్లామర్ లుక్స్ తో ఎప్పటికప్పుడు అదరగొట్టేస్తుంది. తరచూ సోషల్ మీడియాలో రకరకాల కాస్ట్యూమ్స్ తో రకరకాల ఎక్సప్రెషన్స్ పెడుతూ.. రకరకాల ఫోజులతో ఫోటోలని షేర్ చేస్తూ కిక్కెక్కిస్తోంది. పూజ హెగ్డే తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ తో గ్లామర్ గా ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా చక్కగా , గ్లామర్ గా, స్టయిల్ గా కూర్చున్న పూజ హెగ్డే ఫోటో షూట్ చూస్తే ముచ్చటేస్తుంది.
కానీ కొంతమంది పూజ హెగ్డే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఫొటోస్ ని షేర్ చేసే సరికి.. టీడీపీ కలర్ డ్రెస్ లో పూజ హెగ్డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టిడిపి పార్టీ అంటే ఎల్లో కలర్. టిడిపికి వ్యతిరేఖ మీడియా, వెబ్ సైట్స్ టీడీపీ మీద విషం కక్కడానికి ఆఖరికి టాప్ హీరోయిన్ పూజ హేగ్డ్ ని కూడా వదల్లేదు. పూజ హెగ్డే టీడీపీ కలర్ డ్రెస్ లతో ఫోటో షూట్ అంటూ చీప్ కామెంట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంటే సమంత బ్లు డ్రెస్ వేసుకున్నా, లేదంటే ఇంకే హీరోయిన్ అయినా బ్లు డ్రెస్ వేసుకుంటే.. వైసిపి పార్టీ కలర్ అవుతుందా... అంటూ నెటిజెన్స్, టిడిపి అభిమానులు పూజ డ్రెస్ పై చీప్ కామెంట్స్ చేసేవారిపై విరుచుకుపడుతున్నారు.
.
Pooja Hegde latest photo shoot viral







































