హ్యాపీ బర్త్ డే విభ (పూజా హెగ్డే)

Happy Birthday Pooja Hegde

పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 13 ఈమె జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు పూజా హెగ్డే. స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ అగ్రపీఠం వైపు దూసుకుపోతున్నారు పూజా హెగ్డే. 

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు పూజా హెగ్డే. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విభ పాత్రలో నటిస్తున్నారు పూజా. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి ఒక హుషారైన పాత్రలో ఇందులో నటించారు పూజ హెగ్డే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతున్నారు ఈమె. ఖచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలైన తర్వాత విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని చెబుతున్నారు పూజ. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానూలు. 

Most eligible Bachelor team Birthday wishes to Pooja Hegde

most eligible bachelor
pooja hegde
most eligible bachelor movie
akhil akkineni