దసరా బోసిపోయినట్లేనా
Akhanda And Acharya Movie Release Dates soonదసరా బరి నుండి పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తప్పుకుంది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ఓపెన్ కానీ కారణంగా ఆర్.ఆర్.ఆర్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ అఫీషియల్ గా వాయిదా పడింది. కానీ ఇంతవరకు ఏ సినిమా కూడా దసరా రిలీజ్ బరిలోకి రావడం లేదు. ఆర్.ఆర్.ఆర్ తప్పుకుంటే ఆచార్య, అఖండ, ఖిలాడీ లాంటి సినిమాలు దసరా బరిలోకి వచ్చేస్తాయని అనుకున్నారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, విశాల్ ఎనిమి, శర్వా మహా సముద్రం మూవీస్ దసరా రిలీజ్ డేట్స్ ఇచ్చాయి. కానీ ఆచార్య, అఖండ లు మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు.
ఇంకా నెల కూడా లేదు దసరా పండగ. ఆచార్య, అఖండ, ఖిలాడీ డేట్స్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలు పెట్టెయ్యాలి. కానీ దసరాకి సినిమాలు రిలీజ్ చేసే ఉద్దేశ్యం మేకర్స్ కి ఉందొ.. లేదో.. గోపీచంద్ సీటిమార్ హిట్ చూసాక, థియేటర్స్ లో ప్రేక్షకుల హడావిడి చూసాక కూడా మేకర్స్ లో కదలిక లేదు. అఖండ కానీ, ఆచార్య కానీ, ఖిలాడీ కానీ.. ఇలా ఏ సినిమా రిలీజ్ డేట్స్ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు. అంటే ఈ దసరా బరి బోసిపోతుందేమో అనిపిస్తుంది. దసరా సెలవలు కూడా ఊరికే పోయేలా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం.
Akhanda And Acharya Movie Release Dates







































