మరోసారి అడవుల్లోకి పుష్ప

Interesting update on Pushpa

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్ ఇప్పటివరకు హైదరాబాద్ లోనే జరిగింది. మొన్నటివరకు అంటే సెకండ్ వెవ్ తగ్గాక పుష్ప షూట్ రెస్యూమ్స్ అంటూ అంటూ హడావిడి చేసిన పుష్ప టీం.. డెంగ్యు ఫీవర్ బారిన పడడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇక ఈ సినిమాలో ఈమధ్యనే విలన్ గా చేస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ జాయిన్ అవడమే కాదు.. రీసెంట్ గా ఫహద్ ఫాజిల్ విలన్ లుక్ ని రివీల్ చేసింది టీం. హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో నిర్విరామంగా చిత్రీకరిస్తున్న పుష్ప షూట్ మరోసారి అడవుల్లోకి మారబోరుతుందట. పుష్ప షూటింగ్ మొదలైందే మరెడుమిల్లు అడవుల్లో.. అక్కడే లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పుష్ప ఆ తర్వాత హైదరాబాద్ లోనే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసింది. 

త్వరలోనే పుష్ప తదుపరి షెడ్యూల్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం కానుందట. అయితే మారేడుమిల్లి అడవుల్లో పుష్ప రెండో పార్ట్ కి సంబందించిన షూటింగ్ చిత్రీకరణ చేయబోతున్నారని తెలుస్తుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ లో క్రిష్టమస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా టీం ప్రకటించింది. ఇక రెండో పార్ట్ కూడా వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేసే యోచనలో టీం ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గాను, అనసూయ భరద్వాజా కీ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ ఎప్పటికప్పుడు సినిమాపై అందరిలో అంచనాలు పెంచేస్తున్నారు. 

Interesting update on Allu Arjun Pushpa

allu arjun - pushpa
rashmika mandanna
allu arjun
pushpa movie
sukumar pushpa
fahad fasil
pushpa pan india film
bunny - sukku combo
allu arjun-sukumar combo
rashmika-allu arjun combo
fahad villain in pushpa
pushpa raj
fahad fasil vs allu arjun