పుష్ప విలన్ లుక్ కూడా
Pushpa: Fahadh Faasil first look date announcedఅల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ జోరుగా సాగుతుంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ లో విలన్ గా మలయాళ క్రేజీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఎప్పుడు స్టైలిష్ లుక్ తో కలిపించే ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపిస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప రాజ్ మాస్ లుక్ కాదు.. ఊర మాస్ లుక్. అందుకే ఆయనతో తలపడబోయే విలన్ ని కూడా అలానే ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
అయితే మొన్నామధ్యన పుష్ప విలన్ ప్రీ లుక్ తో హడావిడి చేసిన టీం.. రేపు ఉదయం పుష్ప విలన్ లుక్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చేసింది. దానితో పుష్ప మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే పుష్ప ఫస్ట్ సింగిల్ ఇండియా వైడ్ గా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు పుష్ప విలన్ ట్రేండింగ్ లోకి వచ్చిదని. మరి ఫహద్ ఫాజిల్ ప్రీ లుక్ చూస్తే అల్లు ఫాన్స్ లో విలన్ ఫస్ట్ లుక్ పై క్యూరియాసిటీ మరింతగా ఎక్కువైపోతోంది.
First look of Pushpa Villain Fahadh Faasil tomorrow at 10.08 AM!







































