ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Drugs case: ED notices to Tollywood Celebrities

టాలీవుడ్ సెలబ్రిటీస్ కి డ్రగ్స్ షాక్

Drugs case: ED notices to Tollywood Celebrities

2017 లో టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. టాలీవుడ్ లో ప్రముఖ సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో పలువురు సెలబ్రిటీస్ కి ఈడీ ఈ డ్రగ్స్ కేసు నుండి క్లియరెన్స్ ఇవ్వడంతో మరొకసారి డ్రగ్స్ కేసు హైలెట్ అయ్యింది. గత ఏడాది బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ కలకలం మాములుగా లేదు. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ ఈ కేసులో విచారణ ఎదుర్కోగా.. కన్నడ లో సంజన, రాగిణి ద్వేవేదిలు కొన్నాళ్ళు జైలు పాలయ్యారు. 

ఇక తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. దానితో టాలీవుడ్ బడా సెలబ్రిటీస్ కి నోటీసు లు జారీ చేసింది. వారంతా ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసు లలో స్పష్టం చేసింది.ఈ కేసులో బడా సెలబ్రిటీస్ అయిన రకుల్ ప్రీత్, రవితేజ, పూరి జగన్నాధ్, రానా, తరుణ్, నవదీప్, నందు, శ్రీనివాస్, ముమైత్ ఖాన్ లకి ఈడీ నోటీసు లు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.  ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సెలబ్రిటీస్ ని డ్రగ్స్ కేసులో విచారణ జరిపేందుకు ఈడీ సిద్ధమైంది. అయితే తాజాగా రవితేజ స్పందిస్తూ తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.

ED shocks Raviteja, Rana, Rakul Preet Singh, and Puri Jagannath

ed shocks
raviteja
rana
rakul preet singh
puri jagannath
tarun
navadeep
mumbaith khan
drugs case