ప్రముఖ నటి జయంతి మృతి
Senior Actress Jayanthi Passed Awayసీనియర్ నటి జయంతి ఈ రోజు ఉదయం బెంగుళూరులోని తన ఇంట్లోనే కన్ను మూసారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి ఈ రోజు అంటే సోమవారం ఉదయం మృతి చెందడం ఆమె అభిమానులని కలిచి వేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 500 చిత్రాలకి పైగా నటించిన జయంతి వయసు 76 ఏళ్ళు. కన్నడ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయంతి తెలుగులో కొండవీటి సింహం, పెదరాయుడు, బొబ్బిలి యుద్ధం లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం జయంతి బెంగుళూరులో ఉంటున్నారు. అనారోగ్యంతో ఈ రోజు ఉదయమే ఆమె మృతి చెందినట్టుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జయంతి మరణంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా ఇండుస్త్రీలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Kannada Senior Actress Jayanthi Passed Away
kannada senior actress
senior actress jayanthi
jayanthi passed away
telugu - tamil - kannada - hindi
jayanthi died







































