రాజ్ కుంద్రా కి అండగా ఆ నటి
Gehana Vasisth reacts to Raj Kundra arrestబాలీవుడ్ లో నీలి చిత్రాల భాగోతంలో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా చేసింది తప్పే కాదంటూ ఆయన లాయర్ వాదిస్తున్నారు. ఇది ఒకరకమైన వెబ్ సీరీస్ అంటూ రాజ్ కుంద్రా లాయర్ మాట్లాడడం యిప్పుడు చర్చనీయంశం అయ్యింది. అసలు రాజ్ కుంద్రా ఎలాంటి తప్పు చెయ్యలేదంటూ ఇప్పుడొక నటి మాట్లాడడం కాస్త విడ్డురంగా అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ముంబై మోడల్ గేహన వసిష్ఠ. అడపా దడపా తెలుగులో నటించిన గేహన చాలా కాలంగా ముంబై లోనే ఉంది. అప్పుడప్పుడు గ్లామర్, హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపే గెహనా వసిష్ఠ.. ఈ ఫిబ్రవరిలోనే రాజ్ కుంద్రా టీం బ్లు ఫిలిమ్స్ చిత్రిస్తున్నప్పుడు పోలీస్ లు చేసిన రైడింగ్ లో దొరికిపోయి ఐదునెలల జైలు శిక్ష కూడా అనుభవించింది.
కొన్ని రోజుల క్రితమే ఆమె బెయిల్‌పై జైలు నుంచి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంపై గెహనా మరోసారి వార్తల్లో నిలిచింది. గెహనా వసిష్ఠ రాజ్‌కుంద్రాకు చెందిన హాట్ షాట్స్ యాప్ కోసం పని చేసింది. తాజాగా ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అవడంతో గెహనా లైన్ లోకి వచ్చి అవి అసలు పోర్న్ వీడియోలు కాదని.. ఎరోటికా వీడియోలు మాత్రమేనని ... తాము తీసింది పూర్తిస్థాయి నీలి చిత్రాలు కాదని.. న్యాయం కోసం పోరాడతామని.. రాజ్ కుంద్రా కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. తాను అమాయకురాలిని అని, తనేం తప్పు చెయ్యలేదు అంటుంది గెహనా.
Raj Kundra pornographic case: Gehana Vasisth reacts to memes about his arrest







































