ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas Adipurush 50 days shooting celebration

ఆదిపురుష్ 50 డేస్ షూటింగ్ సెలెబ్రేషన్స్

Prabhas Adipurush 50 days shooting celebration

ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో ఓ భారీ సెట్ లో జరుగుతుంది. విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ప్రభాస్ త్వరలోనే ఆదిపురుష్ సెట్స్ లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం ఆయన రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రాధేశ్యాం షూటింగ్ పూర్తికాగానే ప్రభాస్ ముంబై కి వెళ్ళిపోతారు. 

అయితే ఓం రౌత్ - ప్రభాస్ కాంబోలో మార్చ్ లో మొదలైన ఆదిపురుష్ షూట్ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆదిపురుష్ 50 డేస్ షూటింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆదిపురుష్ ని ప్రభాస్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ మొదలై ఐదు నెలలు అయినా.. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్ ఆగిపోయింది. సో షూటింగ్ చేసిన డేస్ ని లెక్కలోకి తీసుకుని ఇలా 50 డేస్ సెలెబ్రేషన్స్ చేసింది టీం. 

అయితే ఇక్కడ ఆదిపురుష్ 50 డేస్ సెలెబ్రేషన్స్ అంటూ హంగామా చేస్తుంటే.. మీమ్స్ చేసేవాళ్ళు.. అరే ఆదిపురుష్ 50 డేస్ ఏనా మాది 1050 డేస్ అంటూ కామెడీ చేస్తున్నారు. అంటే ప్రభాస్ మరో మూవీ రాధేశ్యాం షూటింగ్ 1050 డేస్ అన్నట్టుగా ఫన్నీ గా ఆదిపురుష్ - రాధేశ్యామ్ పై మీమ్స్ చేస్తున్నారు. 

Prabhas - Om Raut Adipurush 50 days shooting celebration

prabhas - adipurush
director om raut
prabhas adipurush pan india movie
bollywood star saif ali kha
prabhas pan india star
prabhas - kriti sanon
saif ali khan - prabhas
adipurush pan india film
prabhas
adipurush update
adipurush shooting