పుష్ప హిట్ అంటున్న రష్మిక

అల్లు అర్జున్ -రష్మిక కాంబోలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. నిన్నగాక మొన్న ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు పుష్ప సినిమాపై మాట్లాడి ఇంకా ఇంకా అంచనాలు పెంచేసాడు. పుష్ప పార్ట్ వన్ ని తాను చూశానని.. కన్నడ హిట్ ఫిలిం కెజిఎఫ్ కి పదిరెట్లు ఎక్కువగా పుష్ప ఉంటుంది అంటూ సినిమాపై అంచనాలు పెంచేసాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక పుష్ప గురించి మట్లాడుతూ.. పుష్ప లో తన రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అని అంటుంది.

అంతేకాకుండా పుష్ప రెండు పార్ట్ లలోను తాను కనిపిస్తాను అని, నాకు ఇష్టమైన పాత్రలో రెండు భాగాల్లో నేను కనిపించడం, చాలా సంతోషాన్నిచ్చింది అని, పుష్ప సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అని అంటుంది. ఆ నమ్మకం తనకి ఉంది అని అంటుంది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప సినిమా లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మొదలు కాబోయే కొత్త షెడ్యూల్ లో అల్లు అర్జున్ - ఫహద్ కాంబో సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. త్వరలోనే పుష్ప కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకాబోతుంది.

Rashmika startling revelations about Pushpa

Rashmika about her role in Pushpa
rashmika mandanna
allu arjun - pushpa
rashmika mandanna
allu arjun
pushpa movie
sukumar pushpa
fahad fasil
pushpa pan india film
bunny - sukku combo
allu arjun - sukumar combo
rashmika - allu arjun combo
fahad villain in pushpa
pushpa raj