సమ్మర్ రేస్ లో అల్లు అర్జున్
Allu Arjun Pushpa to be released in two partsఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్ని సినిమాలు వాయిదా పడతాయో కానీ.. వచ్చే ఏడాది అంటే 2022 లో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ విషయం లో తన్నుకు చావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఏడాది మే, జూన్ లలో వాయిదా పడిన సినిమాలన్ని నవంబర్, డిసెంబర్ లలో రిలీజ్ అయితే ఓకె. కాదు సంక్రాంతికే అంటే కష్టం. ఇక ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ఏదయ్యా అంటే అల్లు అర్జున్ - సుకుమార్ ల పుష్ప మూవీ రెండు పార్ట్ లు గా రిలీజ్ అవడం. ఆ విషయాన్నీ నిర్మాత స్వయంగా చెప్పడంతో అందరికి క్లారిటీ వచ్చేసింది. ఆగష్టు 13 న పుష్ప పార్ట్ వన్ రిలీజ్ కి డేట్ ఇచ్చేసి.. పుష్ప సినిమా షూటింగ్ చేసారు. కానీ అల్లు అర్జున్ కి కరోనా రావడంతో పుష్ప సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి.
అయితే పుష్ప సినిమా ఎప్పుడైతే రెండు పార్ట్ లుగా రిలీజ్ కాబోతుంది అని తెలిసిందో అప్పటినుండి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ లు ఈ సినిమాని ఏ రేంజ్ లో చూపిస్తారో అని. ఇక పార్ట్ వన్ ఆగష్టు 13 న రిలీజ్ అవుతుంటే.. రెండో పార్ట్ 2022 సమ్మర్ అంటున్నారు. అంటే ఇప్పటికే ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ - కొరటాల NTR30, మహేష్ - త్రివిక్రమ్ కాంబో SSMB28 లు 2022 సమ్మర్ ని టార్గెట్ చేశాయి. మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తో అల్లు అర్జున్ కూడా సమ్మర్ రేసులోకి వచ్చేసాడు.
Allu Arjun Pushpa part 2 to be release on Summer 2022







































