Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jathi Ratnalu delated scenes in You tube

జాతి రత్నాలు: అవెందుకు కత్తిరించారయ్యా

Jathi Ratnalu delated scenes in You tube

నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించిన జాతి రత్నాలు బాక్సాఫీసు బాక్సులు బద్దలు కొట్టేసింది. నవీన్ పోలిశెట్టి కామెడీ, రాహుల్ - ప్రియదర్శి కామెడీ సినిమాని హిట్ చేసేశాయి. అనుదీప్ మేకింగ్ స్టయిల్, ఫన్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా స్పెషల్ అట్రాక్షన్ అన్నీ సినిమాకి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. జాతి రత్నాలు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాలో నిడివి కారణంగా ఎడిటింగ్ లో చాలా సీన్స్ లేపెయ్యల్సి వచ్చింది. సినిమా విడుదలైన 20 రోజుల తరవాత ఆ డిలేటెడ్  సీన్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది స్వప్న సినిమాస్ నిర్మాణ్ సంస్థ.

ఆ సీన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో వదులుతూ ఆ సీన్లు ఎందుకు డిలేట్ చేశారయ్యా అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ సీన్స్ లో నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ఆద్యంతం  నవ్వులు పూయించారు. ఆ డిలేటెడ్ సీన్స్ కూడా సినిమాలో ఉంటే బావుండు అనిపించేలా ఉన్నాయి. మరి సినిమా నిడివి దృష్టిలో పెట్టుకునే ఇలాంటివి పక్కనబెట్టారు కానీ.. లేదంటే అవి కూడా మంచి హిట్ అయ్యేలా ఉన్నాయి.

Jathi Ratnalu delated scenes in Youtube

jathi ratnalu movie
naveen polishetty
priyadarshi
rahul ramakrishna
jathi ratnalu
delated scenes
you tube