వకీల్ సాబ్ పవన్ ఎంట్రీ.. భీభత్సమేనట
Pawan Kalyan Entry Scene With Mass Action in Vakeel Saab Movieపవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ థియేటర్స్ లోకి రావడానికి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న వకీల్ సాబ్ పై ఫాన్స్ అంచనాలు మాములుగా లేవు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, లుక్స్, డైలాగ్స్ అన్నిటిని ట్రైలర్ లోనే చూపించేసారు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఇంట్రడక్షన్ కేక పెట్టించేదిగా ఉండబోతుంది. పవన్ హీరోయిజం హైలెట్ చేసేలా ఈ సినిమాని తెరకెక్కించారనే విషయం డైరెక్టర్ మాటల్లోనే తెలిసింది. బాలీవుడ్ పింక్ సినిమాలో ఎలాంటి ఫైట్స్ కి చోటు లేదు. కానీ పవర్ స్టార్ వకీల్ సాబ్ లో ఏకంగా అయిదు ఫైట్స్ ఉన్నాయట.
అందులో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీనే ఓ ఫైట్‌తో ఉండబోతుందట. అంటే ఫైట్ సీన్ తో పవన్ ఎంట్రీ భీభత్సంగా ఉండబోతుంది. ఇక ఇంటర్వెల్ కి ముందు మూడు ఫైట్స్, సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉంటాయని సమాచారం. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కి సంబదించిన ఫైట్.. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఉండబోతుంది అంటే.. ఓ ఇంట్లో రౌడీ మూక చేరి సామాన్లన్నీ విసిరేస్తుంటార్ట. వివేకానందుడి ఫొటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫొటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందట. ఆ చేయి పవన్ దేనట. ఈ యాక్షన్ సన్నివేశాన్ని చాల స్టైలిష్ గా తెరకెక్కించారట.
మరి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై ఫాన్స్ ఏ రేంజ్ హోప్స్ పెట్టుకున్నారో ట్రైలర్ ని యూట్యూబ్ లో ట్రెండ్ చేసినప్పుడే అర్ధమైపోయింది. ఇక బెన్ఫిట్ షోస్, సినిమా కలెక్షన్స్ తో వకీల్ సాబ్ సినిమాని ఫాన్స్ ఏ రేంజ్ లో నిలబెడతారో చూద్దాం.
Pawan Kalyan Entry Scene With Mass Action








































