అనసూయ కూడా దొరికిపోయేలా ఉంది

Anasuya is also to be prone?

జబర్దస్త్ హాట్ బ్యూటీ అనసూయ కెరీర్ వెండితెర - బుల్లితెర మీద మూడు పూవులు ఆరుకాయల మాదిరి ఉంది. వరస సినిమాలు, బుల్లితెర షోస్ తో బాగా బిజీగా గడిపే అనసూయ ఇప్పుడు కోవిడ్ 19 కి దొరికిపోయేలా కనబడుతుంది. కరోనా తగ్గినట్లే తగ్గి మళ్ళీ విశ్వరూపం చూపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా స్ట్రెయిన్ కొత్త తలనెప్పులు తెస్తున్న టైం లో అనసూయ నాకు కూడా కరోనా వచ్చిందేమో అంటూ ట్వీట్ చెయ్యడం ఆమె అభిమానులను కలవరపెడుతుంది. కరోనా బారినపడిన హాట్ హీరోయిన్స్ కోలుకుని యధావిధిగా షూటింగ్స్ చేసుకుంటున్నట్టుగానే అనసూయ కూడా కరోనా నుండి కోలుకోవాలంటూ ఆమె అభిమానులు అప్పుడే ప్రార్ధనలు మొదలు పెట్టారు.

అసలు అనసూయ ఇంకా టెస్ట్ చేయించులేదు. జస్ట్ ఆమెకి కరోనా లక్షణాలు కనిపించాయట. తానొక ప్రోగ్రాం కోసం కర్నూలు బయలుదేరుతుంటే.. కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్న అని, కొద్దిసేపట్లో తాను తన ఫ్యామిలీ కొవిడ్ టెస్ట్ చేయించుకోబోతున్నట్టుగా ట్వీట్ చెయ్యడమే కాదు.. తనని గత రెండు మూడు రోజులుగా కలిసిన వాళ్ళని కోవిడ్ టెస్ట్ చేయించుకోమంటూ ట్వీట్ చెయ్యడంతో జబర్దస్త్ టీం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా టీం మెంబెర్స్ కి దగ్గరగా ఉండడం తో వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. మరి కరోనా టెస్ట్ లో అనసూయ కి పాజిటివ్ వస్తుందో.. నెగెటివ్ వస్తుందో కానీ.. ఇప్పుడు ఆమె అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

 

Is Anasuya covid positive?

anasuya bhardwaj
anasuya
hot anchor
jabardasth anchor
movies
tv shows
ansuya covid 19
positive
corona
ansuya photos