ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Do those who are arguing know the facts?

వాదిస్తున్న వాళ్ళకి వాస్తవాలు తెలియవా.?

Do those who are arguing know the facts?

తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్స్ లో 100 % శాతం అక్యుపెన్సీకి ఆమోదం తెలిపిన విషయం విదితమే. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . సినిమా వాళ్ళ కష్టనష్టాలు తెలిసిన వాళ్ళు ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుంటే.. సింగరేణి బొగ్గులో నలుపుని కూడా శంకించే ఒంకర బాచ్ కొంతమంది మాత్రం వాళ్ళకి తోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆఫ్కోర్స్ వాళ్ళకి వంత పాడేవాళ్లు ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూసే అటెంక్షన్స్ సీకర్స్ తమవైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే.. నిన్నటికి నిన్న ఎవరో ఒక డాక్టర్ పెట్టిన ఓ ట్విట్టర్ పోస్ట్ ని వైరల్ చేసేసారు. అఫ్కోర్స్ ఆ డాక్టర్ మనోవేదనని మనము అర్ధం చేసుకుందాం.

కానీ ఒకసారి వాస్తవంలోకి వెళితే మనకి మద్యం అమ్మకాలు కావాలి. వైన్ షాప్స్ ఓపెన్ చేసెయ్యాలి. సామజిక దూరం పాటిస్తున్నవాళ్ళు  ఎంతమంది. బార్లు  రెస్టారెంట్స్ కి పర్మిషన్ ఇచ్చేశాం. నిర్దేశిత నియమాలు పాటిస్తున్నది ఎంతమంది. రాజకీయ పార్టీలు ర్యాలీలు జరుపుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించేవాళ్ళు ఎంతమంది, గుళ్ళు, చర్చి లు, మసీదులు అన్ని తెరుచుకున్నాయి. బాధ్యతగా నడుచుకునే భక్తులు ఎంతమంది. ట్రైన్స్, బస్సులు బాగానే తిరిగేస్తున్నాయ్. మాస్క్ ని మస్ట్ గా మెయింటైన్ చేస్తున్న ప్రయాణీకులు ఎంతమంది. ఇవి ప్రశ్నించడానికి మాత్రం ఏ వ్యక్తి రాడు. ఏ గొంతు లేదు.

సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం ఇదేదో పెద్ద ప్రాబ్లెమ్ లా, గొప్ప విపత్తులా స్పందిస్తుంటారు సూడో ఇంటలెక్చువల్స్. నిజానికి ఒక క్లోజెడ్ ఆడిటోరియంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా డిఫరెన్స్ ఏమి ఉండదన్న విషయం వివేకవంతులైన అందరికి తెలుసు. అంతెందుకు గవర్నమెంట్ 50 శాతం ఆక్యుపెన్సీ ఇస్తే.. అంతకు మించిన టికెట్స్ అమ్మేసిన థియేటర్స్ ఉన్నాయి. లోపలికి ఎంటర్ అయ్యాక పక్కపక్కనే కూర్చున్న ఆడియన్స్ ఉన్నారు. వ్యక్తిగత రక్షణ అనే అంశం జనంలో బాగా నాటుకుంటే చాలు అని  దేశ ప్రధాని నుండి ప్రముఖ వైద్యుల వరకు అందరూ తేల్చి చెప్పేసాక కూడా.. థియేటర్స్ కి 100 శాతం ఆక్యుపెన్సీ అడగడం తప్పు అని వాదించే వితండవాదులకి వివేకం లేదనుకుందామా? వాస్తవాలు అర్ధం కాదనుకుందామా? లేక ప్రతి లేకి బుర్రకి సినిమా అనేది ఒకటే లోకువగా కనిపిస్తుందా? అనుకుందామా..

Discussion about theaters opening in Tamil nadu

theaters
opening
tamil nadu
ap
ts
100%
50%
sankranthi movies