Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gossips on Pawan Kalyan role in Harish Shankar Movie

పవన్ ఫ్యాన్స్‌కి హరీష్ షాక్ ఇవ్వబోతున్నాడా?

Gossips on Pawan Kalyan role in Harish Shankar Movie

పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్ లోను, స్టైలిష్ లుక్ లోను అదిరిపోతాడు. కానీ డాన్ గాను, అలాగే కాస్త రఫ్ లుక్ లోను అంతగా అనిపించడు. గుడుంబా శంకర్ లో కాస్త రఫ్ కేరెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ స్టైలిష్ గానే కనబడతాడు. అలాగే పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ కేరెక్టర్ అంటే మాసిన గెడ్డం లుక్ అవి ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మరి డాన్ గా స్టైలిష్ గా కనబడితే ఓకె.. కాదు మాస్ గా డిఫ్రెంట్ లుక్ లో రఫ్ లుక్ అంటే పవన్ గట్టిగా ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డాన్ లుక్ గురించి ఎందుకింత డిస్కర్షన్ అంటే.. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాలో డాన్ అవతారమెత్తబోతున్నాడట.

అది కూడా కొద్దీ నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ డాన్ గా కనిపించనున్నాడని.. అంటున్నారు. మరి డాన్ అంటే లుక్ ఎలా ఉంటుందో ఫాన్స్ అప్పుడే ఓ ఐడియాకి వచ్చేసారు. అందుకే వామ్మో పవన్ మనకా లుక్ వద్దు.. నువ్ స్టైలిష్ గానే కనబడు ప్లీజ్ అంటున్నారట. మరి గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ అయినా మాస్ స్టయిల్ లో ఆ కేరెక్టర్ కి జీవం పోసాడు. మరి హరీష్ ఇప్పుడు మాస్ స్టయిల్ లో పవన్ ని డాన్ అవతారమెత్తించడం అనేది కథ ప్రకారం కీలకం అయితే ఓకే.. లేదంటే ఏదో పవన్ ఫాన్స్ కోసం పవన్ అభిమానం కోసం అంటే కష్టం సుమీ.

Pawan Kalyan Don in Harish Shankar Movie

pawan kalyan
harish shankar
don
power star
panja
gudumba shankar