విజయ్ క్రేజ్ కి నిదర్శనం ఇదే..

Vijay holds 3rd place in India..

పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో సంచలన విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. వరుస హిట్లు పడడంతో విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

సోషల్ మీడియాలో విజయ్ కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ. ఆ ఫాలోయింగ్ తోనే వరుసగా అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటున్నాడు. హైదరబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా 2018, 2019 సంవత్సరాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. తాజాగా మరో రికార్డు విజయ్ ఖాతాలోకి చేరింది. ఇండియాస్ టాప్ 50డిజైరబుల్ మెన్- 2019 లిస్టులో విజయ్ దేవరకొండ మూడవ స్థానంలో నిలిచాడు.

మొదటి స్థానంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నిలవగా, రెండవ స్థానంలో  రణ్వీర్ సింగ్ దక్కించుకున్నాడు. మూడవ స్థానంలో విజయ్ దేవరకొండ, నాలుగవ స్థానంలో సర్జికల్స్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన యురి సినిమా హీరో విక్కీ కౌశల్ నిలిచారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు పరాజయం పాలయ్యాక విజయ్ క్రేజ్ తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ లిస్ట్ చూస్తుంటే విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని, ఇంకా పెరుగుతూనే ఉందని అర్థం అవుతుంది.

Vijay holds 3rd place in India..

vijay devarakonda
india most 50 desirable men 2019
arjun reddy
shahid kapoor
ranvir singh