పుష్ప నుండి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి కారణం అదే..?
This is the reason Vijay left from Pushpa..?పాన్ ఇండియా రేంజ్ సినిమా తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్న బన్నీకి, ఆ కోరిక సుకుమార్ తో చేస్తున్న పుష్పతో తీరనుంది. మొదట ఈ సినిమాకి పాన్ ఇండియా ప్లాన్ లేదంట. కానీ బన్నీ అలవైకుంఠపురములో ప్రమోషన్స్ ముగించుకుని వచ్చాక ప్లాన్ మారిపోయిందని అంటున్నారు. అయితే ఇప్పుడు దానివల్లే పెద్ద చిక్కొచ్చి పడింది. చిత్తూరు జిల్లా ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతుంది.
బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తుండగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒకానొక విలన్ గా పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. అయితే విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి గల కారణం పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కడమే అని అంటున్నారు. విజయ్ కి తమిళంలో హీరోగా మంచి ఫాలోయింగ్ ఉంది. అంత ఫాలోయింగ్ ఉన్న హీరో పుష్పలో విలన్ గా కనబడితే కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందేమో అన్న అనుమానంతో సినిమా నుండి తప్పుకుంటున్నాడని చెబుతున్నారు.
ఇతర భాషల్లో విలన్ గా చేసిన ఫర్వాలేదు గానీ, తాను హీరోగా కనిపించే భాషలో విలన్ గా కనిపించడం ఇష్టం లేకపోవడం వల్లనే ఇలా చేస్తున్నాడని టాక్. అయితే విజయ్ సేతుపతిని ఒప్పించడానికి సుకుమార్ ట్రై చేస్తున్నాడట. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా చూడాలి. ఇక మెయిన్ విలన్ గా బాలీవుడ్ నటుడిని తీసుకోనున్నట్లు సమాచారం.
vijay Sethupathi left from Pushpa because of..?







































