పవన్‌ను మించిపోయావ్ డార్లింగ్.. థ్యాంక్స్!
Actress Sree Reddy comments OVer Pawan kalyan and Prabhasప్రజలకు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎప్పుడెలాంటి కష్టమొచ్చిన టాలీవుడ్ ముందు ఉంటుందన్న విషయం కరోనా నేపథ్యంలో మరోసారి రుజువైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలోనూ ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు టాలీవుడ్ నటీనటులు కదిలి ముందుకొచ్చి తమ వంతుగా ఆర్థిక విరాళాలు ప్రకటించడం అభినందించదగ్గ విషయమే. విరాళాలు ఇచ్చేసి ఊరుకోవట్లేదు.. తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేస్తున్నారు. అయితే.. ఇలా తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్న టాలీవుడ్ నటీనటులకు సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేజేలు పలికారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విరాళం.. విరాళం.
అసలేంటిది..!?
ఈ తరుణంలో టాలీవుడ్ నుంచి విరాళాలు అందజేసిన వారిని మనస్పూర్తిగా ఆహ్వానించి.. అభినందించాల్సిందిపోయి వివాదాస్పద నటి, హాట్ భామ శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘డార్లింగ్’ అంటూ ముద్దుగా పిలిచి.. జూనియర్ ఎన్టీఆర్‌కు జై కొట్టింది. ఈ ఇద్దరు హీరోలను గుర్తు చేసుకుని తెగ మురిసిగిపోయింది. అంతేకాదు వీరితో పాటు విరాళం ఇచ్చిన చాలా మంది స్టార్స్ అందరికీ ఈ హాట్ భామ ధన్యవాదాలు తెలిపింది.
మించిపోయావ్ డార్లింగ్!
కాగా.. ఇండస్ట్రీ నుంచి పెద్ద మొత్తంలో మొదట పవన్ కల్యాణ్ రెండు కోట్ల రూపాయిలు విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రభాస్ మాత్రం ఏకంగా నాలుగు కోట్ల రూపాయిలు ఇస్తున్నట్లు ప్రకటించేశారు. దీన్నే అదునుగా చేసుకున్న శ్రీరెడ్డి.. ‘థ్యాంక్స్ డార్లింగ్.. నువ్వు విరాళంలో ఆ పావళాను (పవన్)ను మించిపోయావ్’ అని పరిహాసమాడింది. అంతేకాదు ఇంకా చాలా చాలానే ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో హడావుడి చేసేసింది. అయితే.. ఇలాంటి సందర్భాల్లోనూ నువ్వు.. నీ పైత్యం అంటూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో శ్రీరెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. కాస్త సమయం, సందర్భం అనేది తెలుసుకో శ్రీరెడ్డి అని పలువురు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
Actress Sree Reddy comments OVer Pawan kalyan and Prabhas






































