Advertisementt

ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం: ‘రాహు’ హీరో

Sun 23rd Feb 2020 11:18 PM
raahu movie,hero,abhiram varma,interview  ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం: ‘రాహు’ హీరో
RAAHU Movie Hero ABHIRAM VARMA Interview ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం: ‘రాహు’ హీరో
Advertisement
Ads by CJ

ఛాలెంజింగ్ పాత్రలు అంటే నాకు ఇష్టం.. రాహు హీరో అభిరామ్ వర్మ.

గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న రాహు ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు హీరో అభిరామ్ వర్మ... ‘‘మను సినిమాలో నా నటన నచ్చి దర్శకుడు సుబ్బు గారు ఆడిషన్స్ కి పిలిచారు. దర్శకుడు సుబ్బు కూడా నాలాగే  యుఎస్ నుండి సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన టెక్నీకల్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అందుకే రాహు కొత్త దర్శకుడి సినిమాలా అనిపించదు. కృతి గార్గే, కాలకేయ ప్రభాకర్ ల పాత్రలు చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఈ సినిమాలో లవర్ బాయ్ లా మొదలైన నా పాత్ర యాక్షన్ కి టర్న్ అవుతుంది. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకోసం నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ. కృతి పాత్రలో చాలా సవాళ్లు ఉన్నాయి.

కన్వర్షన్ డిజార్డర్ తో  బాధపడే అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన రాహుతో ఎలా ఫైట్ చేస్తుంది అనేది చాలా ఆసక్తిగా మలిచారు దర్శకుడు సుబ్బు గారు. చాలా మంది అనుకున్నట్లు ఇది జాతకాలు సినిమా కాదు. కథకు రాహు టైటిల్ బాగా సరిపోతుంది సినిమా చూసాక మీకు అర్ధం అవుతుంది. సినిమా చూసి జీ తెలుగు వాళ్ళు శాటిలైట్, డిజిటల్ హక్కులను తీసుకోవడం మా నమ్మకానికి బలం చేకూర్చింది. యు యస్ లో ఫిలిమ్స్ లో మాస్టర్స్ చేసాను. మిస్టర్ ఆంధ్రాగా సెలెక్ట్ అయ్యాను. మిస్టర్ ఇండియా ట్రయల్స్ లో ఉండగా దర్శకుడు తేజ గారి నుండి ‘హోరా హోరీ’ కోసం కాల్ వచ్చింది.

తర్వాత మను, ఇప్పుడు రాహు ప్రతి పాత్ర కూడా ఛాలెంజింగ్ గా ఉండాలని కోరుకుంటాను. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. రాహు చూసిన వారంతా నా నటన గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. కొన్ని కథలున్నాయి

వాటిని వెబ్ సిరీస్ చేద్దామనుకుంటున్నాను అంటూ ముగించారు.

న్యూ ఎజ్ థ్రిలర్ గా ఈ నెల 28న గ్రాండ్ గా రీలీజ్ కాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం - సుబ్బు వేదుల, నిర్మాతలు - ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల,  డిఓపి - సురేష్ రగుతు, ఈశ్వర్ యల్లు మహాంతి, మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్ - అమర్ రెడ్డి, పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా

RAAHU Movie Hero ABHIRAM VARMA Interview:

Hero Abhiram Varma Talks about Raahu movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ