తెరపైకి ఉదయ్‌కిరణ్ బయోపిక్.. హీరో ఎవరంటే?
Uday Kiran Biopic on Cardsఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడవడం ఏమో కానీ.. కొంతమంది జీవితాల్లో ఉన్న కాంట్రవర్సీలను తెర మీద చూపిస్తే అది కచ్చితంగా హిట్ అవడం ఖాయం. అందుకే చాలామంది బయోపిక్స్ అంటూ తియ్యడం స్టార్ట్ చేశారు. పేరున్న వ్యక్తుల జీవితాల్లో జరిగిన మంచి, చెడుని బ్యాలెన్సుడ్ గా చూపెడితేనే సినిమాగా అది సక్సెస్ అవుతుంది. అయితే తాజాగా ఓ యువనటుడు కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువ హీరో బయోపిక్ లో మరో యంగ్ హీరో సందీప్ కిషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. హీరోగా ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉదయ్ కిరణ్ జీవిత చరిత్రని సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. మనసంతా నువ్వే, నువ్వు నేను, శ్రీరామ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తర్వాత ప్లాప్స్ బారిన పడి... జీవితాన్ని అర్దాంతరంగా ముగించిన యంగ్ అండ్ డైనమిక్ హీరో.
అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్ అని ఆయన చనిపోయినప్పటి నుండి అంటున్నప్పటికీ... ఫైనల్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉన్న ఓ దర్శకుడు చేయబోతున్నట్లుగా టాక్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో ఎదిగిన ఉదయ్ కిరణ్ ని కొంతమంది కావాలని తొక్కేశారని, అందుకే ఉదయ్ కిరణ్ ఒక వెలుగు వెలగాల్సిన వాడు కాస్తా... కెరీర్ లో దిగజారిపోయాడని.. అందుకే సూసైడ్ చేసుకున్నాడని అన్నారు. అందులో మెగా ఫ్యామిలీ కావాలనే ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకుండా అతన్నిఈ ఎదగకుండా తొక్కేసిందన్నా ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్ గా సందీప్ కిషన్ కనిపించబోతున్నాడు. ఈ కథ కూడా అప్పుడే రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఉదయ్ కిరణ్ మీద జరిగిన కాంట్రవర్సీ ప్రచారాలని ఆ యువ దర్శకుడు ఈ సినిమాలో చూపిస్తాడా? అసలు సందీప్ కిషన్, ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటించడానికి అంత ధైర్యం చేశాడా? అసలు ఆ యంగ్ డైరెక్టర్ ఉదయ్ జీవితంలో జరిగిన నిజాల్ని భయటపెడతాడా? అంటూ అప్పుడే రకరకాల అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
Young Hero Sundeep Kishan in Uday Kiran Biopic







































