ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Superb Response to Bheeshma First Glimpse

‘భీష్మ’ తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ

నితిన్ ,రష్మిక మండన, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా... కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియోకి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్త్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్, రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదల చేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.

‘భీష్మ’ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్‌గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు :

నితిన్, రష్మిక మండన, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.

మ్యూజిక్ : మహతి స్వర సాగర్, డి.ఓ.పి: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: నవీన్ నూలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్),

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్,  

ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగవంశి,

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల.

Nithiin Bheeshma First Glimpse released

Superb Response to Bheeshma First Glimpse
bheeshma first glimpse
superb response
nithiin
rashmika mandanna
venky kudumula