Advertisementt

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వదిలారు

Mon 28th Oct 2019 07:16 PM
kamma rajyamlo kadapa redlu,movie,trailer,released  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వదిలారు
Kamma Rajyamlo Kadapa Redlu Movie Trailer Released ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ కు విశేష ఆదరణ 

శివ చిత్రం మొదలుకొని ఇప్పటివరకు వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అగ్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటలలోనే అశేష ప్రేక్షక వాహినిని ఆకట్టుకుంది. దీపావళి  బాంబ్ పేరుతో అభివర్ణిస్తూ ఆదివారం ఉదయం వర్మ విడుదల చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మూడు మిలియన్ వ్యూస్ దాటి నాలుగు మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉందని చిత్ర బృందం తెలిపింది. ఇండియాలో టాప్ రేటింగ్లో వున్న ట్రైలర్స్ లో ఒకటి కావడం ఓ విశేషమని చిత్ర బృందం వివరించింది. 

ఇక  టైటిల్ ను బట్టి చుస్తే ఇది రెండు బలమైన సామాజిక వర్గాలకు మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు. కానీ ఈ చిత్ర కధాంశం అది కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని చిత్ర బృందం తెలిపింది. మొత్తం ఏడు పాటలు ఇందులో ఉంటాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. మరోవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నెలలో సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర బృందం వెల్లడించింది. 

Kamma Rajyamlo Kadapa Redlu Movie Trailer Released:

Superb Response to Kamma Rajyamlo Kadapa Redlu Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ