జోరుమీదున్న మెగా హీరో.. డబుల్ పారితోషికం!
Mega Hero Varun Tej hikes Double Remuneration!సింగిల్ సినిమా హిట్టయితే చాలు.. అది హీరోయిన్ అయినా.. హీరో అయినా పరిస్థితులు మారిపోతాయ్. అంతేకాదు.. చాన్స్‌ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం.. వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయన్న విషయం తెలిసిందే. అలా సింగిల్ సినిమాతో స్టార్‌లు అయిన నటీనటీమణులు సినీ ఇండస్ట్రీలో కోకొల్లలు ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోరు మీదున్నాడు. వరుస హిట్లతో ఓ రేంజ్‌లో మెగా హీరోలకు అందనంతగా దూసుకెళ్లిపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో వరుణ్ రేస్‌ని అందుకోవడం ఇప్పుడప్పుడే ఎవ్వరి తరం కాదేమో అనిపించేలా పరుగులు తీస్తున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ సినిమా వరుణ్ కేరీలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా దర్శకనిర్మాతలు ఈయనతో సినిమా చేయాలంటే క్యూ కట్టేస్తున్నారు. అయితే.. దీన్నే అదునుగా తీసుకున్న వరుణ్ తేజ్ గట్టిగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడట. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ ఉన్న పారితోషికాన్ని ఏకంగా డబుల్ చేసేశాడట. కాగా.. ‘వాల్మీకి’ సినిమాకు కేవలం రూ. 3 నుంచి 4 కోట్లు పుచ్చుకునే వరుణ్.. వరుసగా హిట్స్ పడుతుండటంతో ఇమేజ్‌కు తగ్గట్టుగా రూ. 7 నుంచి 8 కోట్లు పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే.. కుర్ర హీరోల్లో ఈ రేంజ్‌లో పారితోషికం తీసుకునేది వరుణ్ మాత్రమేనన్న మాట.
ఇదిలా ఉంటే.. వాల్మీకి తర్వాత స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సర్‌గా వరుణ్ నటిస్తుండగా.. 2 నెలల పాటు బాక్సింగ్‌లో ట్రైనింగ్ కోసం ముంబై వెళుతున్నాడు. రెండు నెలలపాటు బాక్సింగ్‌లో శిక్షణను పూర్తిచేసుకుని తేజ్ తిరిగి డిసెంబర్‌లో తిరిగి హైదరాబాద్ రానున్నాడు.
Mega Hero Varun Tej hikes Double Remuneration!







































