ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Meeku Matrame Chepta Release Date Fixed

‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Meeku Matrame Chepta Release Date Fixed

నవంబర్  1న రిలీజ్ కి సిద్దమైన ‘మీకు మాత్రమేచెప్తా’ 

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసారు. ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ నవంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్భంగా నిర్మాత వర్థన్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ మీట్స్ తో టీం బిజీ బిజీగా ఉంది. ‘మీకు మాత్రమే చెప్పా’ కాన్సెప్ట్ ఎంత కనెక్ట్ అయ్యిందో కాలేజ్ మీట్స్ లో వచ్చిన రెస్సాన్స్ తో తెలుస్తుంది. మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్  1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

‘మీకు మాత్రమే చెప్తా’ లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ. రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.

Meeku Matrame Chepta Movie Release on November 1st

meeku matrame chepta
movie
release
november 1