బాలయ్య 105వ మూవీ లేటెస్ట్ అప్డేట్!

NBK 105 Movie Latest Update

థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్‌ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్‌ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఏపిసోడ్‌ను షూట్‌ చేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Balayya 105th Film Thailand schedule Completed

nbk
balakrishna
105th film thailand schedule
balayya 105th film