నిధి అగర్వాల్ కాక రేపుతోందిగా..!!
Nidhhi Agerwal from 'iSmart Shankar' Song Shootఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ‘దిమాక్ ఖరాబ్...’ అనే సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్న ఈ సాంగ్ ను కాసర్లశ్యామ్ రాశారు. ఈ సాంగ్ తెలంగాణ యాసలో సాగుతుంది. ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ స్టిల్ ను విడుదల చేశారు. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ సాంగ్ సెట్ ను డైరెక్టర్ సుకుమార్ విజిట్ చేసి సరికొత్త స్టైల్లో ఉన్న రామ్ లుక్ ను, సాంగ్ మేకింగ్ ను అప్రిషియేట్ చేశారు.
నటీనటులు:
రామ్
నిధి అగర్వాల్
నభా నటేష్
పునీత్ ఇస్సార్
సత్యదేవ్
మిలింద్ గునాజి
ఆశిష్ విద్యార్థి
గెటప్ శ్రీను
సుధాంశు పాండే తదితరులు
సాంకేతిక వర్గం:
ఫైట్స్: రియల్ సతీష్
సాహిత్యం: భాస్కరభట్ల
ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Nidhhi Agerwal Stills Creates heat in Social Media







































