త్వరలోనే బికినీ ట్రీట్ ఇస్తానంటోంది

Payal Rajput About Bikini

సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ ఎక్కడా ఆగడంలేదు. ఎవరికివారికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఫ్యాన్స్ ను ఆనందపరుస్తూ కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నారు. మొన్నటివరకు నార్త్ ఇండియా వరకే పరిమితం అయిన ఈ పోస్టింగ్ గోల రీసెంట్ గా సౌత్ కి పాకింది.

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్ లో మన హీరోయిన్స్ రెచ్చిపోతున్నారు. ఇటీవల ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలో తన హాట్ మూమెంట్స్, లిప్ కిస్ సీన్లతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా తన ఫ్యాన్స్ కు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పాయల్ చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చింది.

ఓ అభిమాని ‘‘మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్ చేయండి’’ అని అడిగినందుకు పాయల్ దానికి సమాధానంగా తాను బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నానని, మంచి శరీరాకృతి వచ్చిన తరువాత తప్పకుండా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తానని చెప్పింది. మరో అభిమాని మీరు అమ్మ గారితో కలిసి ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చూశారా? అని అడిగిన ప్రశ్నకు...కొంచెం ఇబ్బందిగా అనిపించిందని, కానీ ఇదంతా నీ వృత్తిలో భాగమేనంటూ చెప్పుకొచ్చింది.

Payal Rajput Chit Chat with Netizens

payal rajput
netizens
social media
bikini
rx 100 heroine