స్టార్స్ అయినా ఫైన్ కట్టాల్సిందే..

fine on tollywood top heroes

మొన్నీమధ్యనే మహేష్ బాబు బ్యాంకులో జీరో బ్యాలెన్స్ మెయింటింగ్ చెయ్యడంతో.. ఆ బ్యాంకు వారు మహేష్ అకౌంట్స్ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంలో మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. తాజాగా టాలీవుడ్ లోని స్టార్ అండ్ యంగ్ హీరోలు చాలామంది ట్రాఫిక్ ఫైన్స్ కట్టడం లేదని.. ఒక్కో హీరో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి వేలల్లో బాకీలు పడ్డారని.. తాజాగా బయటికొచ్చిన లిస్ట్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు ప్రముఖులైనా సరే వదలమని చెప్పడమే కాదు.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి ఫైన్స్ బాకీ ఉన్నవారి సెలబ్రిటీస్ పేర్లను మీడియాకి అందజేసింది.

వారిలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి ఎక్కువగా బాకీపడింది సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు గత మూడేళ్ళ కాలంలో 7 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ లు చెబుతున్నారు. ఈ మూడేళ్ళ కాలంలో మహేష్ బాబుకు చెందిన ఏపీ 09 సిఎం 4005 నెంబరు కారుపై 8,745 రూపాయలు ఫైన్ వేశారు. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు ఆ ఫైన్ కట్టలేదు. ఇక బాలకృష్ణ అతివేగంగా కారు నడిపినందుకు గాను... 1,035 రూపాయలు ఫైన్ వేశారు. ఇక పవన్ కళ్యాణ్ 505 రూపాయలు.. నితిన్ 1,035 ఫైన్ చెల్లించాలని.. ఇంకా ఈలిస్ట్ లో సునీల్ మొదలగువారు ఈ ఫైన్ కట్టాల్సిన జాబితాలో ఉన్నారట.

fines to pawan kalyan,mahesh babu and other

mahesh babu
pawan kalyan
bala krishna
sunil
traffic rules
fines