క్రిష్ చేసింది ఆ సీన్‌లు మాత్ర‌మేనా?

director krish un happy with biopic

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందిన‌ చిత్రం `ఎన్టీఆర్‌`. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్ క‌థ‌నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు పేర్ల‌తో రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్నారు. ఈ రెండు భాగాల్లో `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` ఈ గురువారం ( 9న) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. రెండ‌వ భాగ‌మైన `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ పాత్ర గురించి ప‌లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో చాలా వ‌ర‌కు నిజ‌మేన‌ని తెలుస్తోంది. 

ఎన్‌టీఆర్ బ‌యోపిక్ అనుకున్న‌ప్పుడు దీనికి ద‌ర్శ‌కుడు తేజ‌. త‌న‌కు ఫ్రీ హ్యండ్ ఇవ్వ‌క‌పోతే ఎంత పెద్ద‌వారితో అయినా క‌లిసి ప‌నిచేయ‌డానికి స‌సేమిరా అంగీక‌రించ‌డు. తేజ గురించి తెలిసిన వాళ్లు ఎవ‌రైనా ఇదే మాట చెబుతారు. అలాంటి తేజ నాన్న‌కు సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ నేనే చేసుకుంటాను. మిగ‌తా ప‌ని నువ్వు చూసుకో అంటే వింటాడా? వ‌ఇన‌డు క‌దా అందుకే తేజ బ‌య‌టికి వ‌చ్చేశాడు. ఆ త‌రువాత వ‌చ్చిన క్రిష్‌దీ అదే ప‌రిస్థితి. చాలా వ‌ర‌కు ఎన్టీఆర్‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌న్నింటిని బాల‌య్యే తీసుకున్నాడ‌ని చెబుతున్నారు. దీని కార‌ణంగా క్రిష చాలా సంద‌ర్భాల్లో అస‌హ‌నానికి లోన‌య్య‌డని చెబుతున్నారు.

ఇదిలా వుంటే సినిమా ఎడిటింగ్ చేసిన వాళ్ల ప‌రిస్థితి మ‌రోలా వుంద‌ట‌. ఎక్క‌డ క‌ట్ చెప్పాలో అక్క‌డ క‌ట్ చెప్ప‌ని బాల‌య్య కంటిన్యూగా సీన్‌ల‌ని ర‌న్ చేశాడ‌ని, అది రేపు సినిమా ఫ‌లితంపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం వుంద‌ని చిత్ర బృందంలోని కొంత మంది గుస‌గుస‌లాడుకుంటున్నారు. మ‌రి ఇంతోటి దానికి బ‌యోపిక్ అని పేరు పెట్టి తీయ‌డం ఎందుకు?, త‌మ‌కు నచ్చిన‌ట్టే సీన్‌లన్నీ మార్చుకోవ‌చ్చుక‌దా? అని ఫైన‌ల్ అవుట్‌పుల్ చూసిన ల్యాబ్ సిబ్బంది పెద‌వి విరుస్తున్నార‌ని తెలిసింది. 

director krish un happy with ntr biopic

ntr
ntr biopic
krish
krish jagarlamudi
ntr kathanayakudu
teja
ntr mahanayakudu