పాపా పాయల్ ఇలా చేస్తే ఎలాగమ్మాయ్..!!
Payal Increasing the heat in Winterఇదివరకంటే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ బట్టి ప్రాముఖ్యత ఉండేది కానీ.. ఈమధ్యకాలంలో హీరోయిన్స్ కి గ్లామర్ డోస్ బట్టి ప్రిఫరెన్స్ ఉంటోంది. ఈ విషయాన్ని ఏమాత్రం లేట్ చేయకుండా గ్రహించిన కథానాయకి పాయల్ రాజ్ పుట్. అందుకే ఆర్ ఎక్స్ 100 రిలీజై ఇప్పటికీ అయిదారు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకూ కథానాయికగా మరో సినిమా సైన్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో రచ్చ చేస్తుంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం చూపకపోవడం అమ్మడికి విపరీతంగా కలిసొస్తోంది.
ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తున్నా తరుణంలో అమ్మడు ఒక కొత్త ఫోటోషూట్ వదిలి.. హీట్ పెంచడానికి ప్రయత్నిస్తోంది. నిండుగా కప్పుకున్నా కూడా కళ్ళతోనే కసి పెంచుతున్న పాయల్ ఫోటోలు చూసి కుర్రాళ్ళు వేడెక్కిపోతున్నారట. పాయల్ కి ఇది కొత్తేమీ కాదు.. గత అయిదారు నెలలుగా అమ్మడు చేస్తున్న పని ఇదే. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ పాత్ర పోషిస్తున్న పాయల్ కి ఇప్పటివరకూ అన్నీ ఐటెమ్ సాంగ్ లేదా సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాతైనా తనను కథానాయికగా గుర్తిస్తారని ఆశిస్తోంది పాయల్. మరోపక్క రవితేజ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది అని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడం గమనార్హం. సినిమా ఆఫర్లు పక్కన పెడితే ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్ళ హృదయాల్లో కల్లోలం సృష్టిస్తున్న పాయల్ ను చూసి కొత్త హీరోయిన్లు చాలా నేర్చుకోవాలి.
Payal Raising the Temparatures with her latest Photoshoot







































