చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్..డోంట్ వర్రీ!!

RRR Movie Latest Update

ప్రస్తుతం నందమూరి, మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు రాజమౌళి సినిమా కోసం ఎప్పుడు రెడీ అవుతారు.. అలాగే రాజమౌళి, ఎన్టీఆర్ అండ్ చరణ్ ల మల్టీస్టారర్ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళతాడు అనే ఆత్రుతతో ఉన్నారు. అయితే మీడియాలో రాజమౌళి ఈ మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో లేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ మగధీర సినిమాతో ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న రాజమౌళి.. ఈ సినిమాని జాపనీస్ భాషలో జపాన్ లో విడుదల చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే న్యూస్ విన్నాక ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.

అయితే ఎన్టీఆర్ మరియు చరణ్ ల మల్టీస్టారర్ ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగానే  అక్టోబర్ నుండి పక్కాగా సెట్స్ మీదకెళుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కథ మీద కూర్చున్న విజయేంద్రవర్మ కథ ఫైనల్ కాగానే రాజమౌళి పక్కగా స్క్రిప్ట్ వర్క్ తోపాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించేస్తాడట. ఈ లోపు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల అరవింద సమేత సినిమా ఒక కొలిక్కి రావడమే కాదు.. అరవింద సమేత - వీర రాఘవని దసరా కానుకగా విడుదల చేసేందుకు గాను షూటింగ్ ని వేగంగా పరిగెత్తిస్తున్నారు ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు. ఇక ఎన్టీఆర్ అక్టోబర్ కి ఫ్రీ అవుతాడు.

ఇక రామ్ చరణ్ - బోయపాటిల మూవీ సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ తన షూటింగ్ ని నవంబర్ కల్లా పూర్తి చేసి ఫ్రీ అవుతాడట. ఇక బోయపాటి మాత్రం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నవంబర్ అండ్ డిసెంబర్ లలో కానిచ్చేసి సినిమాని సంక్రాంతికి తయారు చేస్తాడట. ఇక రాజమౌళి చెప్పిన టైంకి చెప్పినట్టుగా రామ్ చరణ్ కూడా పక్కాగా సెట్స్ మీదకెళ్తాడట. సో ముందునుండి అనుకున్నట్టుగానే రాజమౌళి ఈ ఎన్టీఆర్ అండ్ చరణ్ ల మల్టీస్టారర్ ని అక్టోబర్ లో మొదలు పెట్టి... నవంబర్ చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ కానిచేస్తాడట. సో నందమూరి, మెగా అభిమానులు డోంట్ వర్రీ.

Charan and NTR Fans Don't Worry about RRR

rajamouli
ram charan
ntr
fans
rrr movie
updates