మిస్టర్‌ సి ఎంతో మంచోడు: ఉపాసన!

Charan Flower Shopping, For Whom?

రామ్‌చరణ్‌ ప్రస్తుతం 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌ సంతోషంలో ఉన్నాడు. ఆ వెంటనే ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా మరోచిత్రం ప్రారంభించాడు. రామ్‌చరణ్‌ లేకుండానే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ని బోయపాటి పూర్తి చేశాడు. కానీ 'రంగస్థలం' చిత్రం సాధించిన విజయం చూసిన రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను చిత్రానికి సంబంధించిన కథలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడని సమాచారం. దాంతోనే ఆయన ఈ చిత్రం బ్రేక్‌ తీసుకుని ఉపాసనతో విదేశాలకు వెళ్లాడు. 

ఇక తాజాగా రామచరణ్‌ ఓ ఫ్లారిస్ట్‌ వద్ద షాపింగ్‌ చేస్తోన్నరామ్‌చరణ్‌ ఫొటోని ఆయన శ్రీమతి ఉపాసన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. మిస్టర్‌ సి తన కోసం ఫ్లవర్‌ బొకేని కొన్నారని సంతోషంగా తెలిపింది. ఈ ఫోటోలో రామ్‌చరణ్‌ ఓ బొకేని పొదివి పట్టుకున్నట్లుగా ఎంతో సున్నితంగా పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ ఫొటో చూసిన మెగాభిమానులు తమ వదిన ఉపాసన అంటే తమ హీరో రామ్‌చరణ్‌కి ఎంత ఇష్టమో అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇందులో రామ్‌చరణ్‌ ఎంతో అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తున్నాడు. ప్రకృతికి సాక్ష్యంగా నిలిచే పూలు ఆయన చేతిలో పదిలంగా ఉన్నాయి. ఈ పిక్‌ చూస్తుంటే అన్నయ్యకి తమ వదిన అంటే ఎంత ఇష్టమో తెలుస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. 

ఇక ఈ ఫొటో ఎక్కడ తీసింది? ఆ బొకేని రామ్‌చరణ్‌ ఎక్కడ కొని, షాపింగ్‌ చేశాడో మాత్రం తెలియడం లేదు. ఇక త్వరలో రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను చిత్రంలో పాల్గొని నిరంతరాయంగా జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడట.

Upasana shares Cherry’s flower shopping secrets

ram charan
upasana
flower shopping
social media