సమంత గిఫ్ట్ పంపుతుందట!

Samantha Fun Challenge on MahaNati

నేటి రోజుల్లో చిత్రాలకు ప్రమోషన్‌ అనేది ఎంత కీలకంగా మారిందో అందరికీ తెలుసు. ఇక స్టార్‌ హీరోలే ఈ రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేస్తూ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి చిత్రంకి ఈ ప్రమోషన్స్‌ కంపల్సరీగా మారిపోయాయి. ఇక తాజాగా మే 9 వ తేదీన విడుదల కానున్న 'మహానటి' సావిత్రి బయోపిక్‌ విషయంలో కూడా ఇందులో మధురవాణి అనే జర్నలిస్ట్‌ పాత్రను చేసిన సమంత ఈ చిత్రం ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టింది. 

ఆల్‌రెడీ చిల్‌ సావిత్రి అంటూ తనదైన యూటిట్యూడ్‌తో విజయ్‌దేవరకొండ రెచ్చగొడతే తాజాగా సమంత ఈ 'మహానటి'లో ఉన్న 'మాయా బజార్‌'లోని 'అహనా పెళ్లంట.. ఓహోనా పెళ్లంట' అనే పాటను సావిత్రిల చేయడానికి ప్రయత్నించింది. ఇలా చేయడం చాలా కష్టమని ఒప్పుకుంటూ మరి ఊరికే సావిత్రి గారిని మహానటి అన్నారా? అంటూ ప్రశ్నించిందది. ఇది 'అహనా పెళ్లంట' వీడియో అని, ఎవరైనా సరే ఈ పాటలో సావిత్రిలా బెస్ట్‌ వెర్షన్‌ వీడియోను చేసి, వారు పంపిన వాటిల్లో బెస్ట్‌ని ఎంపిక చేసి స్పెషల్‌ గిఫ్ట్‌ని అందిస్తామని సమంత తెలిపింది.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ ప్రొడక్షన్స్‌ వారు మహానటి ఫన్‌ చాలెంజ్‌ పేరిట ఈ కాంటెస్ట్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఫేమస్‌ పాటను డబ్‌ స్మాష్‌ చేసి సమంతకి షేర్‌ చేసి పంపితే చాలు. వాటిల్లోని బెస్ట్‌ వీడియోలను సమంత ఎంపిక చేసి వారికి గిఫ్ట్‌ని అందిస్తుంది. 

Samantha Fun Challenge Contest.. Celebrate Savitri

samantha
fun challenge
contest
savitri
mahanati