నాని ఆ డైరెక్టర్ తో చేయట్లే..!
Nani Rejects Director Vikram Kumar Movieఈ మధ్యన హీరో నాని చాలా డీసెంట్ గా కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ... అంతే కొత్తగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కథలో కొత్తదనం లేకపోయినా నానికున్న క్రేజ్ తో సినిమా ఎలా ఆడుతుందో అనేది గత డిసెంబర్ లో వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ)' నిరూపించింది. ఆ సినిమాకి అనుకున్నంత పాజిటివ్ టాక్ రాకపోయినా నానికున్న క్రేజ్ తోనే సినిమా కలెక్షన్స్ అదిరిపోయాయి. అయితే నాని ఆతర్వాత హలో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. విక్రమ్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా, నాని మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఒకేసారి విడుదలై ఎంసీఏ కి మిక్స్డ్ టాక్, హలో కి పాజిటివ్ టాక్ రాగా హలో కలెక్షన్స్ ఘోరంగాను, ఎంసీఏ కలెక్షన్స్ అదిరిపోయాయి.
అప్పట్లోనే విక్రమ్ కుమార్ తో నాని సినిమా అన్నారు. నాని కూడా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' తర్వాత విక్రమ్ డైరెక్షన్ లో నటిస్తాడని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు నాని - విక్రమ్ కాంబో పట్టాలెక్కే ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే విక్రమ్ కుమార్, నానిని కలిసి కథ చెప్పగా.. అందులో ఫస్ట్ హాఫ్ నచ్చి, సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో.. నాని కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే ఇప్పుడా ప్రాజెక్ట్ మీద అనుమానం మొదలైందంటూ టాక్ వినబడుతుంది.
దాదాపుగా నాని - విక్రమ్ కాంబో లేనట్టే అని అంటున్నారు. అందుకే నాని వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడట. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్న నాని... మరో రెండు కథలను లైన్ లో పెట్టాడట. అందుకే విక్రమ్ కుమార్, స్వప్నదత్ కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ వినబడుతుంది. హీరో దొరకడమే ఆలస్యం విక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలెడతాడని అంటున్నారు.
Nani Rejects Vikram Kumar Movie Nani expressed his dislike over the second half narrated by Vikram Kumar







































