ఆ హీరోతో లింక్ గురించి ఇలియానా ఇలా!
Ileana D'Cruz rubbishes rumours of being recommended by Ajay Devgnదక్షిణాది నుండి ఎగిరెళ్ళి మరీ బాలీవుడ్ లో తిష్టవేసి సౌత్ ని చిన్న చూపు చూస్తున్న గోవా బ్యూటీ ఇలియానా చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేకపోయినా... ఎప్పుడూ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రు ని సీక్రెట్ పెళ్లి చేసుకుందనే న్యూస్ మరవకముందే... సౌత్ దర్శకులు కేవలం నడుమందాలనే చూస్తారని విమర్శించి హాట్ టాపిక్ అయ్యింది. మరి కేవలం ఇలియానా అందరిని విమర్శించడమే కాదు ఇలియానా మీద కూడా బోలెడన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ లేకపోయినా... వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అక్కడే పాతుకుపోయిన ఇలియానా మీద ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫేర్ తో ప్రేమ పెళ్లి వ్యవహారాల మీద అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో ఎన్ని నిజాలో.... ఎన్ని గాసిప్స్ అనేది మాత్రం తెలియదు గాని... ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఇలియానా మీద మరో గాసిప్ వినబడుతుంది. అది కూడా అజయ్ దేవగన్, ఇలియానాల మీద. మరి అజేయ దేవగన్ కాజోల్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లలని కని హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు. అలాంటి అజయ్ దేవగన్ కి ఏ హీరోయిన్ తో లింక్ పెట్టిన దాఖలాలు లేవు.
కానీ ఇప్పుడు తాజాగా అజయ్ దేవగన్ ఇలియానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నాడని... ఎందుకంటే బాద్షాలో కలిసి నటించిన వీరు మళ్ళీ రైడ్ మూవీ లో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు కాబట్టే ఈ రూమర్ ఇంతలా స్ప్రెడ్ అయినట్లుగా చెబుతున్నారు. బాద్షా లో ఇలియానా నటనకు ఇంప్రెస్స్ అయిన అజయ్ దేవగన్ ఇప్పుడు రైడ్ మూవీలో కూడా ఇలియానాని రికమెండ్ చేశాడనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం ఆ న్యూస్ గాసిప్ కాదని ఇలియానా కూడా ఒప్పుకుందట. కేవలం ఇదే కాకుండా టోటల్ ఢమాల్ అనే సినిమాలో కూడా ఇలియానానే హీరోయిన్ గా తీసుకోమని అజయ్ తెగ రికమెండ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ వలన తాను చాలా హర్ట్ అవుతున్నాని... తనకెలాంటి రికమండేషన్స్ లేవని వాపోతోందట ఇల్లీబేబీ.
Has Ajay Devgn Been Recommending Ileana D'Cruz? Here's What She Has To Say






































