బుక్కై కూడా.. బుకాయిస్తే ఎలా..?
Okka Kshanam Movie Copy to Korean film Parallel lifeఇతరభాషా చిత్రాలను, పరదేశంలో వచ్చే చిత్రాల పాయింట్స్‌ని కాపీ కొట్టి సినిమాలు తీయడం మన మేకర్స్‌కి బాగా అలవాటే. ఇక ఈ విషయంలో రైట్స్ కొనుక్కుని తీస్తే ఏ సమస్య ఉండదు. అల్లుఅరవింద్ మాత్రం ఏ చిత్రం రిలీజైనా అది ఏ భాషా చిత్రమైనా సరే... తాను నిర్మించిన చిత్రాల కోవలోకి వస్తే మాత్రం ఊరుకోడు. ఆ మధ్య ఓ బాలీవుడ్ చిత్రం ట్రైలర్ చూసి అది 'మగధీర'కి కాపీ అని కోర్టు మెట్లు ఎక్కాడు. ఆ తర్వాత కోర్టు ఆ సినిమాకి, మగధీరకి సంబంధమే లేదనితేల్చింది. రిలీజ్‌కి దగ్గర పడుతున్న సమయంలో ఆ చిత్ర నిర్మాతలను అల్లుఅరవింద్ బాగానే భయపెట్టాడు. మరి ఆయనే ఇతర భాషా చిత్రాలను ఫ్రీమేక్‌లుగా తీస్తుంటాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన అల్లు శిరిష్ చిత్రం 'ఒక్క క్షణం'. విఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లుఅరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సినిమా మంచి టాక్‌నే సాధించింది. కానీ ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగానే ఇది కొరియన్ చిత్రం 'ప్యారలల్ లైఫ్'కి కాపీ అనే వార్తలు వచ్చాయి. ఆ కొరియన్ చిత్రం రీమేక్ హక్కులను స్వయంగా మరో నిర్మాత అనిల్‌సుంకర కొన్నాడు. దాంతో 'ఒక్కక్షణం' విషయంలో చివరి దాకా సస్పెన్స్ నడించింది. చివరకు తాను 'ఒక్కక్షణం' చూశానని, అది తన చిత్రం కాపీ కాదని అనిల్‌సుంకర చెప్పడంంతో సినిమా రిలీజ్ అయింది. తీరా సినిమా చూస్తే ఇది ఆ కొరియన్ చిత్రమైన 'ప్యార్‌లల్‌లైఫ్'కి కాపీ అని తేలిపోయింది. ఈ విషయంలో అల్లు శిరీష్ , అల్లుఅరవింద్, దర్శకుడు విఐ ఆనంద్‌లు కూడా కాపీ అని ప్రచారం చేస్తే ఎలా? సినిమా చూసిన తర్వాత చెప్పండి. ఆ కొరియన్ చిత్రానికి మాకు ఏమి సంబంధం లేదు. ఇది చాలా కొత్త కథ అని మీడియాపై చిందులేశారు.
మరోవైపు అనిల్‌సుంకరకి ఆ చిత్రం రీమేక్ రైట్స్ కొన్న మొత్తం చెల్లించడంతో పాటు అదనంగా దాదాపు 50లక్షలు అటు ఇటుగా అల్లుఅరవింద్ ముట్టజెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఒక వైపు కాపీ చేస్తూ, అదే విషయాన్ని మీడియా ముందుగానే చెప్పి ప్రశ్నిస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కాపీ అయితే నిలదీయండి అని ప్రగల్బాలు పలికిన ఈ నీతి మంతులు నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. మరి దీనికి వారి వద్ద సమాధానం ఉందా? అనేదే ప్రశ్న.
Copy Allegations on Allu Sirish Okka Kshanam Movie








































