Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Salman and Katrina acted Tiger Zinda Hai Movie Song Released

సల్మాన్ - కత్రినా రొమాన్స్ చూడాలనివుందా?

Salman and Katrina acted Tiger Zinda Hai Movie Song Released

బాలీవుడ్ లో సూపర్బ్ జంటల్లో మనకి ముందు గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్. వీళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనవసర్లేదు.. వీరిద్దరూ కలిసి నటించిన ఏక్ థా టైగర్ సినిమానే చెబుతుంది వీళ్ల కెమిస్ట్రీ ఏంటో. ఈ సినిమాలో వీళ్లు 'మాషాఅల్లా...' పాటలో అయితే.. ఇద్దరూ కలిసి ఇరగదీసేశారు. ఈ పాట అప్పట్లో ట్రెండ్ సెట్ అయింది.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించిన చిత్రం 'టైగర్ జిందా హై'. ఈ ఏడాది 'ట్యూబ్ లైట్' తో డీలా పడ్డ సల్మాన్ మళ్ళీ 'టైగర్ జిందా హై' మూవీతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చేలా వున్నాడు. డిసెంబర్ 22 న వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా వుంది. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఓ పాటని రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. 'స్వాగ్ సే కరేంగ్ సబ్ కా స్వాగత్' అంటూ సాగే పాటను విడుదల చేస్తున్నారు. అయితే ఈ పాటలో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కెమిస్ట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట.

ఈ పాట కోసం సల్లూ భాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్.... 'ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుసు. అందరి అంచనాలను అందుకునేలా ఈ పాటను చిత్రీకరించాం. సల్మాన్ - కత్రినాల కెమిస్ట్రీ అదిరిపోయే లెవల్లో ఉంటుంది....ఈ పాటలోని లొకేషన్స్.. స్టైలింగ్ కూడా ఆకట్టుకుంటాయి' అని అంటున్నాడు.

Romance between Salaman and Katrina in tiger zinda hai Movie Song

salman khan
katrina kaif
tiger zinda hai
romance song