వితౌట్ గెడ్డం, వైట్ హెయిర్ తో ఇరగదీస్తున్నాడు..!

Thala Ajith in Vivegam Movie

అజిత్ కి అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అజిత్ సినిమా వస్తుంది అంటే చాలు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం 'వివేగం'. ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'వివేగం' చిత్రం ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది.  ఇంటర్‌పోల్‌ అధికారిగా నటిస్తున్న అజిత్ ని పవర్ ఫుల్ యాక్షన్ కోణంలో చూపించాడు డైరెక్టర్. టెక్నాలజీని మాత్రం విస్తారంగా ఉపయోగించాడు డైరెక్టర్ శివ. అజిత్ నెవెర్... ఎవర్.... గివ్ అప్ అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను పెంచేసింది. ఒరిజినల్ గెటప్ వితౌట్  గెడ్డం, వైట్ హెయిర్ తో అజిత్ 'వివేగం' లో ఇరగదీస్తున్నాడు.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలాన్ గా నటిస్తున్నాడు. మరి అజిత్ తో డైరెక్టర్ శివ  తెరకెక్కించిన 'వీరం, వేదాళం' చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా వీరి కాంబినేషన్ లో తెరకెక్కే 'వివేగం' కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అజిత్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Ajith's did not say separate about tollywood fans, in Hollywood fans and in Kollywood fans. Ajith's movie comes with the expectations at the tara level. Ajith and Director siva combo movie 'Vivegam' is coming soon in theaters.

thala ajith
vivegam movie
director siva
sathya jyothi films
kajal