గోపీచంద్ పరిస్థితి ఏమిటి....?
What is the Gopichand Situation..?టాలీవుడ్‌లో ఉన్న కమర్షియల్‌గా మినిమం గ్యారంటీ హీరోగా రవితేజ తర్వాత నిన్నటి వరకు అందరూ గోపీచంద్ గురించి చెప్పుకునే వారు. ఇక ఆయన 'లౌక్యం' చిత్రంతో మరలా గాడిలో పడ్డాడని అందరూ ఆనందించేలోపే 'సౌక్యం'తో దెబ్పైపోయాడు. జయాపజయాలకు అతీతంగా ఏడాదికి రెండు చిత్రాలైనా చేసే ఈయన కిండటి ఏడాది అసలు వెండితెరపైనే కనిపించలేదు. కానీ ఆ బాకీ మొత్తాన్ని ఈ ఏడాది తీర్చేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ దర్శకుడు సంపత్‌నందితో ఆయన చేస్తున్న 'గౌతమ్ నందా' చిత్రం పూర్తికావచ్చింది.
ఈ చిత్రంలో గోపీ మేకోవర్ చూసి, ఆయన స్టైలిష్‌లుక్ చూసి చాలామంది బాగా ఇంప్రెస్ అవుతున్నారు. అద్భుతమైన లుక్స్‌తో, గెటప్‌తో అదరగొడుతున్నాడు. ఇక ఆయన ఎంతో కాలం గ్యాప్ తర్వాత సూపర్‌హిట్ చిత్రాల ఏస్ ప్రొడ్యూసర్ ఎ.యం.రత్నం తెలుగులో నిర్మిస్తున్న 'ఆక్సిజన్' వంటి వెరైటీ చిత్రంలో నటిస్తున్నాడు. ఎప్పుడు భగవాన్, పుల్లారావులు నిర్మాతలుగా తమిళదర్శకుడు భూపతి పాండ్యన్ దర్శకత్వంలో 'జగన్మోహన్ ఐపిఎస్' అనే చిత్రం మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ బాషల్లో ద్విభాషాచిత్రంగా తీయాలని, గోపీని కోలీవుడ్‌కి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నయనతారకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రం నుంచి భూపతి పాండ్యన్‌ని తొలగించి, సీనియర్ మాస్‌డైరెక్టర్ బి.గోపాల్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.
తాజాగా ఈ చిత్రానికి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్‌లుక్ వదిలారు. కానీ ఈ చిత్రం పోస్టర్‌లో వక్కంతం వంశీ పేరు కనిపిస్తోంది. ఏదిఏమైనా ఈ చిత్రం తమిళంలో కూడా రూపొందిందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. మరోపక్క 'ఆక్సిజన్' చిత్రం కూడా తమిళంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి గోపీ లక్ ఎలా ఉందో ఈ ఏడాది విడుదలయ్యే ఈ మూడు చిత్రాలతో తేలిపోతుంది.
Minimum Guarantee Hero in Tollywood with Ravi Teja till yesterday all about Gopichand.Gopichand this year three movies are comming, one is 'Gautham nanda',two is 'Oxygen' and 'Aradugula Bullet'. Gautham nanda director by Sampath Nandi







































