సినీరంగానికి చెందిన వ్యక్తికి దక్కిన గౌరవమిది!

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడుగా శ్రీ వి. రామ సుబ్బారావు నియామకం
తెలంగాణ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడుగా శ్రీ వి. రామసుబ్బారావును నియమించినట్టు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బి.జి.ఎమ్ రెడ్డి తెలియజేశారు. రామసుబ్బారావులోని సేవాగుణాన్ని, నిజాయితీని గుర్తించి తాము ఈ నియామకం చేశామని ఆయన తెలిపారు.
ఈ నియామక పత్రాన్ని ఉపాధ్యక్షుడు శ్రీమహ్మద్ షా షేక్ హైదరాబాద్‌లో సోమవారం నాడు అందచేశారు. వీరితో పాటు ఉపాధ్యక్షుడుగా శ్రీ అలకుంట హనుమంతరావు కోశాధికారిగా శ్రీ మహ్మద్ మతీన్ని నియమించారు.
శ్రీ రామసుబ్బారావు ఇటు సినిమా రంగంలోనూ, అటు నిర్మాణ రంగంలోనూ సుపరిచితులు. ఆయన అంకిత భావంతో పనిచేస్తాడు, అందుకే వారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడుగా నియమించినట్టు ఉపాధ్యక్షులు మహ్మద్ షా షేక్ తెలిపారు. తెలంగాణకు సంబంధించిన మిగతా కార్యవర్గాన్ని రామసుబ్బారావే నియమిస్తారని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించబడిన రామసుబ్బారావు మాట్లాడుతూ, తనకు జాతీయ అధ్యక్షుడు బి.జి.ఎమ్.రెడ్డి గారు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులకు ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ తాముంటామని, సమాజానికి ఇతోధిక సేవ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు బి.బి.ఎమ్.రెడ్డి గారికి, ఉపాధ్యక్షుడు మహ్మద్ షా షేక్ గారికి రామసుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.







































