పెయిడ్ ఐటమ్స్ కు 'టాప్ దినపత్రిక' సై!

జర్నలిజం విలువలు చెప్పే 'ఈనాడు' దినపత్రికలో సినిమా వార్తలు కూడా చిత్రంగా ఉంటాయి. గతంలో జరిగిన వివాదం కారణంగా ఈనాడులో సినిమా ప్రకటనలు కనిపించవు. దానికి బదులుగా ప్రత్యేకంగా సినిమా ప్రమోషన్ వార్తలే వేస్తుంటారు. తాజాగా ప్రకటనల బదులుగా పెయిడ్ ఐటమ్స్ వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. సినిమా పేజీ పైభాగంలో ప్రత్యేకంగా క్వార్టర్ పేజీలో పెయిడ్ వార్తలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 'కాష్మోరా', 'నరుడా డోనరుడా..' న్యూస్ ఈ విధంగా వేశారు. దీనికి భారీ మొత్తం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ పరిణామం నిర్మాతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే సినిమా వార్తలను పెయిడ్ ఐటమ్స్ గా పత్రికల్లో వేయడం కొత్తకాదు. 'సాక్షి', 'టైమ్స్ ఆఫ్ ఇండియా', 'దక్కన్ క్రానికల్' ఇప్పటికే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇందులో భాగంగానే సినిమా రిలీజ్ కు ముందు హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతల ఇంటర్య్వూలు, ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంటారు. ఈ పరిణామం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బంది తప్పదు. ఎన్నికల సమయంలో ఇలాంటి పెయిడ్ ఐటమ్స్ రాజకీయ నేతలు వేయించుకుంటారు.  ఇప్పుడు ఈ ట్రెండ్ సినిమా వార్తలకు సైతం వచ్చింది. అయితే సర్క్యూలేషన్ లో అగ్రభాగాన ఉన్న పత్రికలకే ఇలాంటి పెయిడ్ వార్తలు వస్తాయి. 

eenadu
paid items
no ads
special interview
eenadu news papaer